* ఎటూ తేలని అసైన్డ్ భూమి మార్పు వివాదం
* రెండో రోజూ కొనసాగిన ఆమరణ నిరాహార దీక్షలు
* ప్యూరిఫికేషన్ పేరుతో మాకే అన్యాయమన్న బాదితులు
* అంతా చట్టం ప్రకారమే చేసామన్న రెవెన్యూశాఖ

శంఖవరం – జనాసవార్త
———————————-
తమ సొంతమైన జిరాయితీ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారు… మాకు న్యాయం చేయండి… మా మరణమో … భూమి వివరం మార్పును సరి చేయడమో జరిగేంత వరకూ దీక్షను విరమించం… అంటూ నాలుగు కుటుంబాలు సభ్యులు పిల్లా పెద్దలతో సహా మండల కేంద్రమైన రౌతులపూడిలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నుంచి చేస్తున్న సామూహిక ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు మంగళవారం కూడా యధావిధిగా కొనసాగింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూఖడిలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యా శాఖ అధికారులు, బాధితులైన దళితుల మధ్య సమస్య పరిష్కారం విషయమై మంగళవారం పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల చెప్పిన వివరణలు, హిత వచనాలు బాదితులకు సంతృప్తిని ఇవ్వలేదు. రాజీ మార్గాలు, దీక్ష విరమణకు చేసిన పోలీసు అధికారుల ప్రయత్నాలూ సఫలం కాలేదు. దీంతో రెండో రోజూ ఆమరణ నిరాహార దీక్ష నిరవధికంగా రెండో కొనసాగింది. తమ జిరాయితీ భూమిని డి పట్టా (ప్రభుత్వ) భూములుగా మార్చిన అధికారులు పూర్వపు జిరాయితీ భూమిగ మార్చే వరకూ దీక్ష విరమించం అంటూ బాదితులు స్థిర నిర్ణయంతో మూడో రోజు దీక్ష కోసం దీక్షా శిబిరంలోనే మొండి పట్టుదలతో తిష్ట వేసారు.

ప్రస్తుత బాధితుల నాలుగు కుటుంబాల పూర్వీకుడైన కట్టు సత్తయ్యతో పాటు మరో 13 మంది రైతులకు కూడా 1933 సంవత్సరం తర్వాత అనంతర కాలంలో భూములను సబ్ డివిజన్లను చేసిన రెవెన్యూ అధికారులు ఆ 13 మందినీ విడచి పెట్టి మా భూములకే దస్త్రాల్లో డి పట్టా భూములుగా ఎందుకు నమోదు చేసారని దీక్షలో ఉన్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ 13 మందిలో 11 మంది తమ భూములను అమ్ముకోగా ఆ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలను, మిగతా ఇద్దరికి అనువంశిక జిరాయితీ భూములుగా రెవెన్యూ దస్త్రాల్లో ఇదే రెవెన్యూ అధికారులు నమోదు చేసారనీ, మా భూములకే డి పట్టా భూములుగా మార్పును ఎందుకు చేసారనీ, వారికి న్యాయం, మాకు అన్యాయం ఎందుకు చేసారనీ తాహసిల్దార్ అబ్బాస్ ను, డిప్యూటీ తాహసిల్దార్ పిడి. సత్యనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ కరీముల్లాను బాధితులు ప్రశ్నించారు. ఇదే విషయాలను అన్నవరం పోలీస్ ఎస్సై రవికుమార్ కు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ ల్యాండ్ రికార్డ్ ప్యూరిఫికేషన్ చట్టం ప్రకారం ఒక్కొక్కరి భూముల తప్పుడు వివరాలను రెవెన్యూ దస్త్రాల్లో దశల వారీగా సరి దిద్ధుతూ వస్తున్నామని, అంతే తప్ప భూమి వాస్తవ స్థితి వివరాలను తాము ఎంత మాత్రమూ మార్చలేదని ఇటు బాధితులకు, అటు పోలీసులకు, మీడియాకు రెవెన్యూ అధికారులు ఎంతో సహనంతో దీక్షా శిబిరం వద్దే పదే పదే బహిరంగంగా వివరణ ఇచ్చారు.

అయినప్పటికీ బాధితులు సంతృప్తి చెందలేద. సమాధాన పడలేదు. పైగా అధికారులు, బాధితుల మధ్య ఒకింత వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు చేయిదాటిపోతే చట్టం ప్రకారం పోలీసులు తమ విధులను నిర్వర్తించక తప్పదని, జరుగబోయే పరిణామాలకు దీక్షలకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు ప్రధాన బాదితులే బాద్యత వహించాల్సి వస్తుందని ఒకింత హెచ్చరిక పూరితమైన అసహనాన్ని ఎస్సై వ్యక్తం చేసారు. అయినా బాధితులు తమ మొండి పట్టు వీడలేదు. దీంతో కరోనా నిబంధనల ప్రకారం 40 మంది నుంచి ఇద్దరికి మాత్రమే దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి లభించింది. రెవెన్యూ శాఖ వివిధ దశల ఉన్నత అధికారుల ముందు, న్యాయ స్థానంలోనూ ఈ సమస్యను పరిష్కరించుకునే ఆర్ధిక స్థోమత తమకు లేదని, రికార్డు వివరాలను తారు మారు చేసిన రౌతులపూడి తాహసిల్దార్ కార్యాలయ పరిధిలోనే తమకు పరిష్కారం, న్యాయం చేయాలని అధికారుకు బాధితులు తెగేసి చెప్పారు. సమస్య, ఆమరణ నిరాహార దీక్షా శిబిరం యధావిధిగా కొనసాగు తున్నాయి.

——————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *