* లీకైన నాగార్జున ఒరిజినల్ లుక్
* ముసలి మన్మథుడు అంటూ ట్రోలింగ్

హైదరాబాద్ – జనాసవార్త
————————————
‘అన్న నడిచొస్తే మాస్.. అన్న నించుంటే మాస్.. అన్న లుక్కేస్తేమాస్ … మ.. మ… మాస్!! అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్.. అన్న మడతెడితే మాస్.. అయ్యా మాస్ … అదీలెక్క అనేట్టుగానే ఉంటుంది కింగ్ నాగార్జున చూస్తే’’..

కింగ్ నాగార్జున ఎక్కడ కనిపించినా.. ఎవరు పలకరించినా మొదట అడిగే ఒకే ఒక్కమాట.. వావ్!! 60లో కూడా 30 ఏళ్ల మన్మథుడిలా కనిపిస్తున్నారు.. ఏం తింటున్నారు సార్ అనే అడుగుతారు. చూడ్డానికి టాలీవుడ్ కింగ్ ఇలాగే ఉంటారు మరి.. ప్రస్తుతం ఆయన వయసు 61 క్రాసైనా సరే.. అందులో సగమే లెక్కలోకి తీసుకోవాల్సింది అనేట్టుగానే మన్మథుడు మెరిపిస్తుంటాడు. కొడుకులు పెద్దవాళ్లై ఇంటికి కోడల్లు వచ్చినప్పటికీ కూడా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో నాగార్జున ఇప్పటికీ కింగే.

అయితే తాజా లుక్ చూస్తే మాత్రం నాగార్జునను మన్మథుడు అని పిలవడానికి గ్యారంటీగా సంకోచిస్తారు. ఎందుకంటే 61 ఏళ్ల నాగార్జున తన ఒరిజినల్ లుక్‌లో దర్శనం ఇచ్చారు. మెరిసిన జుట్టు, మీసకట్టుతో షాకిచ్చిన నాగార్జున 61 ఏళ్లకు పూర్తి న్యాయం చేసేట్టుగానే కనిపిస్తున్నారు. ఎక్కడ కనిపించినా 30 ఏళ్ల యువకుడిలా మెరిసిపోయే నాగార్జున… మెరిసిన జుట్టుతో దర్శనం ఇచ్చి తన అసలు రూపాన్ని చూపించేసరికి ఆయన ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.

ఇన్నాళ్లూ మేకప్.. మేకప్ అని హీరోయిన్లను మాత్రమే ట్రోల్ చేసేవారు. ఇప్పుడు నాగార్జున ఒరిజినల్ గెటప్ చూసి ముసలి మన్మథుడు, తాతయ్య అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటో ఎక్కడ నుంచి వచ్చింది? ఆయన పక్కన ఉన్నది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో కాగా.. రెండోది కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ మూవీ చేస్తున్నారు. వీటితో పాటు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్‌గా రెడీ అవుతున్నారు నాగార్జున.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *