గుమ్మరేగుల – జనాసవార్త
————————————-
యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేతలు అందరిలోనూ జనం గుండెల్లో శాశ్వతంగా నిలచిన ఒకే ఒక్క నేత డా.వైఎస్.రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని గుమ్మరేగుల పంచాయతీ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని శంఖవరం మండలంలోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని 32 గ్రామాల్లోనూ అలాగే రౌతులపూడి మండలంలోని 26 పంచాయితీలు, 12 సచివాలయాల పరిధిలోని 42 గ్రామాల్లోనూ ఆ మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో సర్పంచ్ రాపర్తి రామకృష్ణ నేతృత్వంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి తొలుత క్షీరాభిషేకాన్ని, తదుపరి జలాభిషేకాన్ని నిర్వహించారు. విగ్రహానికి గ్రామస్తులు పూల మాలు వేసి ఘన నినాళులను అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, సభికులకు మిఠాయిలను పంచి పెట్టారు.
అనంతరం సర్పంచ్ రామకృష్ణ సభికులను ఉద్దేశించి మాట్లాడారు. పేద ప్రజలు అందరికీ ఆరోగ్యశ్రీ, విద్యార్ధులకు ఫీజ్ రీఎంబర్సుమెంట్, బెస్ట్ ఎవలయబుల్ స్కూల్స్, 108 సేవలు, రైతుల పంట పొలాలకు ఉచిత విద్యుత్ వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అందించిన మహా మనిషి రాజశేఖరుడు అన్నారు. భౌతికంగా ఆ మహానేత మన మధ్య లేకపోయినా ప్రతీ అభిమాని గుండె చప్పుడుగా ఆయన ఉండి పోయారు అన్నారు. అంతటి మహానేత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించి ఆయన కన్న కలలను నేటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన రెడ్డి సాకారం చేస్తున్నారు అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణ మూర్తి, కొండమూరి చంటిబాబు, బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *