*మండలంలోని అవినీతి, అక్రమాలపై దృష్టి సారించాలని ఆర్.టి.ఐ కార్యకర్తలు విన్నపం.

*సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బాబూరావు

ఎస్.రాయవరంజనాసవార్త
——————————————–
విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలు ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి యూ.ఎఫ్.ఆర్.టి.ఐ జిల్లా కార్యవర్గం గురువారం సాయంత్రం విన్నవించింది. ముఖ్యంగా ఎస్.రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి ఆ గ్రామంలోని రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారని అదే గ్రామానికి చెందిన దండు గణపతిరాజు ఎమ్మెల్యే బాబూరావుకి తెలియ జేసారు. ఎండోమెంట్ భూములు, వేలం పాటల విషయంలో జోక్యం చేసుకొని అభివృద్ధికి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా చూస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. ఇప్పటికే కార్యదర్శిపై పలు విమర్శలు వచ్చి పడుతున్నాయని, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగు తున్నారని వివరించారు.
ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే స.హ చట్టం కార్యకర్తలతో నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా ఎస్.రాయవరం మండల సమస్యలపై దాదాపు గంటన్నర పైగా సమయం కేటాయించి విషయాలను ఆసాంతం విన్నారు. వివిధ సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు.

ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ పంట కాలువలు, దేవాదాయ శాఖ భూములు, అటవీ శాఖ భూములు గురించి కూలంకషంగా చర్చించినారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి పింఛన్లు, నిజమైన అర్హులకే
ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు పలు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. దీనికి బదులుగా ఎమ్మెల్యే వాటి వివరాలతో పాటు ఆధారాలతో కూడిన మెమోరాండంను మీరు  అందజేయాలని కోరారు. అలా అందజేసినట్లైతే ఆ లబ్ధిదారుల ఎంపిక స్వయంగా నేనే చూస్తానని 100 శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు భూఅక్రమణ దారుల వివరాలు రాత పూర్వకంగా మీ వద్ద ఆర్.టి.ఐ ద్వారా సేకరించిన సమాచారంమను అందజేసినట్లైతే ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకునే వరకూ మీ తరపున పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. లేఔట్ల క్రమబద్దీకరణ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అవినీతికి పాల్పడిన, సక్రమంగా పని చేయని అధికారులను మార్చే విధంగా చర్యలు చేపడు తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాల అమలులో అధికారులు ఎవరైనా సక్రమంగా స్పందించక పోయినట్లైతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తల కారణంగా పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఆ నాయకుల చేసే పని పట్ల నేను స్వయంగా శ్రద్ధ వహించి అర్హులకు పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. మీ సామాజిక కార్యకర్తలు, ఆర్.టి.ఐ కార్యకర్తలు మా రాజకీయ నాయకులు ఎవరైనా తప్పుచేస్తే నిజాయితీగా మా ముందు చెప్పవచ్చని తెలిపారు. ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటానని ఈ సందర్భంగా ఆయన మాట ఇచ్చారు. అలాగే నేను మాట ఇస్తే తప్పనని అన్నారు. ఏ స్వార్థం లేకుండా, స్వప్రయోజనాలను విడచి సమాజానికి ఉపయోగపడే మీలాంటి సామాజిక కార్యకర్తలంటే నాకు చాలా అభిమానం అన్నారు. నాకు మీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ కార్యకర్తలు తెచ్చే ఫిర్యాదులు పరిష్కరించడంలో ఎప్పుడూ వెనకాడేది లేదని స్పష్టం చేశారు.
అడక్కుండానే అంత సమయాన్ని కేటాయించిన ఎమ్మెల్యే సానుకూల తీరుపై స.హ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఖలిసిన వారిలో యు.ఎఫ్.ఆర్.టి.ఐ జిల్లా కో కన్వీనర్ బి.వి.వి. సత్యనారాయణ, జిల్లా కార్యవర్గం సభ్యులు బంగార్రాజు, మండల కన్వీనర్ సోమిరెడ్డి రాజు, మండల కమిటీ సభ్యులు సేనాపతి లోవరాజు, తోట రాజు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *