శంఖవరం, జూలై 12, (జనాస వార్త) :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని, నూతన విద్యా విధాన సర్క్యులర్‌ నెం 172A & 12020 ఉపసంహరించు కోవాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని
శంఖవరం ఐసిడిఎస్. ప్రాజెక్టు సిబ్బంది కోరారు. అఖిల భారత అంగన్ వాడీ కోర్కెల దినం సందర్భంగా శంఖవరంలోని ప్రజెక్టు కార్యాలయం వద్ద కొద్దిసేపు సోమవారం వర్షంలో ధర్నా చేసారు. సమాజంలో మాతృ, శిశు మరణాలు తగ్గించడానికి, పిల్లలను బడికి అలవాటు చేయడానికి, వారికి అనుబంధ పౌష్టిక ఆహారాన్ని అందించడంలో అంగన్ వాడీ సిబ్బంది
కీలక పాత్ర పోషిస్తున్నారు…. దేశ వ్యాప్తంగా పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అనేక సేవలందిస్తున్న అంగన్వాడీలను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి…. మన రాష్ట్రంలో ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడీ సెంటర్లల్లో కొన్ని ప్రాధమిక పాఠశాలల్లో కలపడం అన్యాయం అంటూ అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేసారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిపి 1, పిపి 2 , ప్రిపరేటరీ, ప్రీ ప్రైమరీ స్కూల్లో ఒకటి, రెండు తరగతులను కలపి పౌండేషన్ విద్యగా మార్చాలని నిర్ణయించడం ప్రీ స్కూల్ పిల్లలకు, లబ్దిదారులకు, అంగన్ వాడీలకు నష్టదాయకమైన చర్య అని 172 / ఏ I / 2020 ఈ సర్క్యులర్ ను ఉపసంహరించు కోవాలని కోరారు. కరోనా కాలంలో కూడ అంగన్ వాడీలు లబ్ధిదారులకీ ఆహారాన్ని, ఆరోగ్య సేవలు అందిస్తున్నారని వీరికి ఎటువంటి భద్రత పరికరాలు ఇవ్వని కారణంగా అనేక మందికి కరోనా సోకిందని, రాష్ట్రంలో దాదాపు 40 మంది వరకు చనిపోయారని, అంగన్‌వాడీలకు ఇచ్చేది అతి తక్కువ గౌరవ వేతనం ఇస్తున్నారని దీనిని పెంచాలని, హెల్పర్లకు కూడ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్లు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఇళ్ళ స్థలాల జి.ఓను అమలు చేయాలని, 7 సంవత్సరాల నుంచి సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, తెలంగణాలో వేతనాలు పెంచినట్టే మన రాష్ట్రంలో కూడా పెంచాలని కోరారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్‌వాడీ సెంటర్లను ప్రాధమిక పాఠశాలలో మార్చటాన్ని ఆపాలని, నూతన విద్యా విధానాన్ని, పోషణ ట్రాకర్ యాప్ ను రద్దు చేయాలని, తెలంగాణాలో పెంచిన విధంగా అంగన్‌వాడీలకి వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ .21,000 లు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, కరోనాతో చనిపోయిన అంగన్‌వాడీలకి రూ. 50 లక్షలను, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సంక్షేమ పధకాలు వర్తింప చేయాలని, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, హెల్పర్లకు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రాజకీయ జోక్యాన్ని , సచివాలయ పోలీసుల వేధింపులు అరికట్టాలని పెండింగ్ బిల్లులు, సెంటర్ అద్దెలు చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయాలని, లబ్ధిదారులకి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మెనూ చార్జీలు పెంచాలని, కార్మిక వ్యతిరేకతను ఉపసంహరించు కోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ కరించొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *