శ్రీకాకుళం – జనాసవార్త
———————————-
శ్రీకాకుళం జిల్లా మానవ హక్కుల జిల్లా అధ్యక్షునిగా డా. గుండబాల మోహన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘ ప్రధాన కార్యదర్శి కీర్తిసింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ ఈ అధ్యక్ష పదవిలో సంవత్సరం కొనసాగుతారు. ఈ నియామకం సంధర్భంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం
గ్రామీణ మండలంలోని పాడు గ్రామంలో శ్రీకాకుళం జిల్లా మానవ హక్కుల జిల్లా అధ్యక్షుని హృదాలో డాక్టర్ గుండబాల మోహన్ పాత్రికేయులతో మంగళవారం ఉదయం మాట్లాడారు. తనకి ఈ అధ్యక్ష బాధ్యతను అప్పగించిన జాతీయ స్థాయి కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మానవ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
త్వరలో పూర్తి స్థాయి జిల్లా మానవ హక్కుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైనా తమ మానవ హక్కుల కమిటీలో పని చేయాలనుకున్నా, ఎవరి హక్కులకైనా బంగం కలిగినా తనను 9492265697లో సంప్రదించ వచ్చని ఈ సందర్భంగా
డాక్టర్ గుండబాల మోహన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *