శంఖవరం, జూలై 13, (జనాసవార్త) :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న
“నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళు” పధకం లబ్దిదారుల్లోని మహిళా స్వయం శక్తి సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి రూ. 50,000 ఋణ సదుపాయం కల్పించాలని శంఖవరం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి జాగారపు రాంబాబు పేర్కొన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో
మండలంలోని వివిధ శాఖల అధికారులకు రాంబాబు ఆద్వర్యంలో అవగాహనా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాలనీల లేఔట్లలోని మొత్తం 400 గృహాల పునాదుల నిర్మాణానికి మొదటి దఫాగా మండలంలోని వివిధ బ్యాంకుల ద్వారా లబ్దిదారులకు ఒక్కొక్కరికీ రూ. 50,000 చొప్పున ఋణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు అందరూ కృషి చేయాలని ఎంపీడీవో రాంబాబు ఆదేశించారు. ఫేస్1 హోసింగ్ గ్రామాల్లోని 10 నుంచి 15 మంది లబ్ధిదారులతో మహిళా శక్తి సంఘాలను ఏర్పాటు చేసి, వారికి తాపీ మేస్త్రీలను కేటాయించడంతో పాటు లబ్దిదారులు పునాదులను వరకు నిర్మించు కోడానికి అవసరమైన సొమ్ములు రూ. 50,000 లను, ఇల్లు మొత్తం పూర్తయ్యే వరకూ వివిధ దశల్లో మొత్తం రూ. 1,00,000 వరకూ బ్యాంకు రుణాలను ఇప్పించాలని రాంబాబు వివరించారు. లబ్దిదారులకు ఇండ్ల స్థలం, గృహనిర్మాణ పధకం మంజూరు చేయడంతోపాటు వారి గృహ నిర్మాణాలకు పెట్టుబడి నిధులుగా బ్యాంకు రుణాలను కూడా ఇప్పించే బాధ్యతను అధికారులకే ప్రభుత్వం నిర్దేశించిన విషయాన్ని, లక్ష్యాలను ఎంపీడీవో తన తోటి అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, ఈవోపీఆర్డీ కాశీవిశ్వనాధం, ఏపీఎం, సిసిలు, ఏపీఓ, ఎంఈఓ, హౌసింగ్ ఏఇ, లేఔట్ నోడల్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, టెక్నికెల్ అసిస్టెంట్స్, ఆయా మిగతా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *