* మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడి నిర్వాహకం
* పట్టించుకోని అధికారులు.
* ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటం
* చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండు 

యస్.రాయవరం, జులై 14, (జనాసవార్త):

జనాల్లో స్వార్ధం పెచ్చుమీరి పోయింది…. ప్రజా ప్రయోజనం అనే లక్ష్యం కనుమరుగు అవుతోంది… ఇండ్లలోని చెత్తా చెదారాన్ని తెచ్చి నడి రోడ్డుపై పోయడం ఇప్పుడు ఆనవాయితీ, ఓ అలవాటుగా మారి పోయింది. ఈ నీచపు పనులు చేసేవారు తెలిసీ తెలియని అమాయక ప్రజలంటే ఏమో అనుకోవచ్చు. అదే అధికార  పార్టీకి చెందిన నేత ఐతే ఖచ్చితంగా మనం  వివిరంగా చెప్పుకోవాల్సిందే….

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రం యస్.రాయవరం గ్రామం నుండి పులపర్తి నేషనల్ హైవేకు పోవు తారు రోడ్డును ఆనుకొని కుడి వైపున ఉన్న ఇల్లు, షెడ్ నుండి కొబ్బరి కాయల వ్యర్ధాలను తారు రోడ్డు, పంట కాలువలో వేస్తూ ప్రజల అనారోగ్యాలకు, ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఎస్.రాయవరం పోలీసు స్టేషనుకు కూత వేటు దూరంలో పులపర్తి వెళ్ళు తారు రోడ్డును ఆనుకొని శ్రీనివాసరావుఇల్లు, కొబ్బరి కాయలు షెడ్, వాటి గొడౌన్ ఉన్నాయి. ఇంటిని ఆనుకొని ఉన్న షెడ్డులో కొబ్బరి కాయల వ్యాపారస్తుడు శ్రీనివాసరావు కుళ్ళిన కొబ్బరి కాయలు, వీటి నుండి వచ్చిన వ్యర్ధాలు, పీచు త తదితర వ్యర్ధాలను ఇంటికి రోడ్డు అవతల తారు రోడ్డు, పంట కాలువలో వేస్తున్నారు. దీనితో అక్కడ పందులు చేరి పాడు చేయడంతోను, వర్షాల వలన తారు రోడ్డు పైకి రావడం, కుళ్ళిన వాసన వలన ప్రజలు నానా యాతన పడు తున్నారు. సమీపంలో ఉన్న తన గొడౌన్ లో తన సోదరుడుతో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా శ్రావ్య బయోటెక్ పేరుతో రొయ్యలు, చేపల పెంపకంనకు అవసరమైన కెమికల్ మందుల పరిశ్రమ వలన స్థానిక ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బoదులు  పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చేసిన ఫిర్యాదులపై అధికారులు స్పందించ లేదు. ఏ చర్యలూ చేపట్టలేదు. ఈ గొడౌన్లోనే ప్రభుత్వ బ్రాంది షాపును నిర్వహంచడంతో మందు బాబుల ఆగడాలను అప్పటికే అనుభవిస్తున్న  ప్రజలు ఈ రోడ్డుపై వేస్తున్న చెత్త, కెమికల్ పరిశ్రమ వ్యర్ధాలతో మరింత నరకం అనుభవిస్తున్నారు. మందుబాబులు గూoడ్రిబిల్లి వరకు రోడ్డు ప్రక్క, సమీప పొలాలలో త్రాగుతూ పడేసిన గాజు పెంకులు గుచ్చుకొని రైతులు, పాదచారులు క్షతగాత్రులు అవుతున్నారు. రోడ్ పై పేరుకు పోయిన చెత్త వలన పందులు చేరి పాడు చేయడంతో మరింత విస్తరించి ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇక్కడ యాక్షిడెంట్లు అవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. నాయకుడైన వ్యక్తి ప్రజలందరికీ ఆదర్శంగా ఉండవలసిన ఉండగా మండల నాయకుడుగా డప్పుకొట్టుకొనే ఇటువంటి వ్యక్తులే కనీస సామాజిక స్పృహ కాని, బాధ్యత కాని లేకుండా వ్యవహరించడం, దానికి అధికారులు వంతపాడడం ఇక్కడే చెల్లిందన్న వాఖ్యనాలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలో ప్రస్తుత కరోనా మహమ్మారి వలన పలువురు గ్రామస్తులను కోల్పోయి, ఇప్పటికీ కరోనా సోకిన ప్రజలు, నాయకులు హాస్పిటల్స్ చుట్టు తిరుగుతున్నట్లు తెలిసినా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని, వైస్సార్ పార్టీ మండల నాయకుడు కొణతాల శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని
ఎస్. రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు అధికారులను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *