ప్రత్తిపాడు, జూలై 15, (జనాసవార్త)
————————————————–
కరోనా వ్యాధి, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బంది కలిగి నందున కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రేషన్ కార్డులో ఉన్న ప్రతీ పౌరునికి 5 కేజీల బియ్యం గాని 5 కేజీల గోధుమలను గాని ఉచితంగా ఇస్తున్నందుకు ప్రతీ చౌక దుకాణం వద్ద కేంద్ర ప్రభుత్వ పధకం ప్లెక్స్ బోర్డ్ పెట్టాలని, అలాగే రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండ కూడదని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పదకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 28 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 లక్షల ఇళ్లే నిర్మించడానికి అంగీకరించగా ఆ గృహ నిర్మాణ పధకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం రూ.1,50,000 చొప్పున మంజూరు చేసినందున గృహములు నిర్మించు సముదాయముల దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం పథకం ప్లెక్స్ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రత్తిపాడు మండల తహశీల్దార్ గోపాలకృష్ణకు భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శింగిలిదేవి సత్తిరాజు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మదినే బాబ్జీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *