* శంఖవరంలో 3 భవనాల నిర్మాణం పూర్తి
* ఒక్కో భవన నిర్మాణానికి రూ. 21.8 లక్షలు
* నేడు ప్రారంభించనున్న ముగ్గురు మంత్రులు

శంఖవరం, జూలై 15, (జనాసవార్త) ;
————————————————-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏడాది కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విజయోత్సవాన్ని పురస్కరించుకుని మునుపు ఎన్నడూ లేని రీతిలో రైతులకు వ్యవసాయాన్ని పండుగను చేయాలనే సత్సంకల్పంతో రైతు భరోసా పధకానికి, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇక రైతు భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు, శిక్షణా తరగతులు, సాగు సూచనలు, సలహాలు, సమావేశాల నిర్వహణ, ఎరువులు, పురుగు మందుల అమ్మకం, రాయితీ విత్తనాల పంపిణీ, యంత్ర పరికరాలను అందించే విజ్ఞాన కేంద్రాలుగా, రైతుల ఏరువాక, విత్తనం నాటింది మొదలు, బీమా, పంట అమ్మకం, గిట్టుబాటు ధర కల్పించే వరకు ఈ కేంద్రాల ద్వారా మొదలు పంట అమ్మకం వరకూ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లుగా విలసిల్లేలా సేవలందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10.641 రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రారంభించారు. కాగా ఈ రైతు భరోసా కేంద్రాలు లేని చోట కొత్తగా స్థలాలను సేకరించి, నిధులను విడుదల చేసి, భవన నిర్మాణాలను చేపట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం పంచాయితీలోని మూడు సచివాలయాల పరిధిలోనూ ఒక్కో భవనం చొప్పున మూడు రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. వీటి నిర్మాణానికి స్థానిక గ్రామ కంఠంలోని మూడేసి సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాంచారు. ఒక్కో భవన నిర్మాణానికీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం నుంచి 90 శాతం నిధులు, రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి 10 శాతం నిధుల వాటాల కింద మొత్తం రూ. 21.8 లక్షల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాంట్రాక్టర్ పడాల గంగాధర రామారావు(పిజి) ఈ మూడు భవనాలను నిర్మించారు. ఈ భవనాల్లో రైతుల సమావేశ మందిరం, డిజిటల్ రూమ్, గ్రంధాలయం, ఎరువుల డిపో తదితర విభాగాలు, సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, పూలతో అలంకరించి ప్రారంభానికి సిద్దం చేసారు. వీటిని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ. వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ తదితరులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించ నున్నారు.

అన్నవరంలో మంత్రి వెల్లంపల్లి బస
————————————————–
శంఖవరం, అన్నవరం గ్రామాల్లోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గురువారం విచ్చేస్తున్న మంత్రి వెల్లంపల్లి గురువారం సాయంత్రం 3 గంటలకు విజయవాడలో మంత్రి కారాయాలయం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి రాత్రి 8 గంటలకు అన్నవరం చేరుకుని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం లో బస చేసి మరుసటి రోజు శుక్రవారం ఉదయం దేవస్థానంలోనూ, శంఖవరంలోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడలోని మంత్రి స్వగృహానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *