* తన నైజం చాటుకున్న మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడు

యస్.రాయవరం, జులై 16, (జనాసవార్త):
———————————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రం యస్.రాయవరం గ్రామం నుండి పులపర్తి నేషనల్ హైవేకు పోవు తారు రోడ్డును ఆనుకొని కుడివైపున ఉన్న ఇల్లు, షెడ్ నుండి కొబ్బరి కాయల నిండి వచ్చు వ్యర్ధాలను తారు రోడ్డు, పంట కాలువలోను వేస్తూ ప్రజల అనారోగ్యాలకు, ప్రమాదాలకు కారణం అవుతున్న వైస్సార్ పార్టీ మండల నాయకుడు కొణతాల శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలని వచ్చిన పిర్యాదు పై స్పందించి రోడ్డు పై ఉన్న చెత్తను రోడ్డు ప్రక్కకు, పంటకాలువలోకి వేసి తారురోడ్డు పైన లేకుండా చేసి మమ అనిపించారు. అంతే తప్ప చేసిన తప్పు బయట పడి అందరకూ తెలిసింది, చేసినది పొరపాటు పని, ఇప్పటికైనా సరిదిద్దుకొని మానవత్వం చాటుకోవాలన్న ఇంకింత జ్యానం లేకుండా, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, నాపై ఎవరు చర్యలు తీసుకుంటారు, నేను మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడను అన్న గర్వంతో రోడ్డు పై వేసిన కొబ్బరి నుండి వచ్చిన వ్యర్థాలు తొలగించి దూరంగా బయట వేయవలసింది పోను అక్కడే రోడ్డు నుండి ప్రక్కకు జరిపి తన నైజం చాటుకున్నాడు. “రోడ్డు పైనే కొబ్బరి వ్యర్థాలు – మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడు నిర్వాహకం.” ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలతో చెలగాటం. వివిధ మీడియాల్లో వచ్చిన వార్తలకు ప్రజలు స్పందించారు. ప్రజలతోపాటు అధికారుల నుండి కూడా ఆ నాయకునిపై వత్తిడి రావడంతో రోడ్డు పైన ఉన్న చెత్తను తొలగించి ప్రక్కన వేసారు. ఇప్పటికే కరోనా కేసులు రోజూ యస్.రాయవరం మరియు పరిసర ప్రాంతాలలో వస్తున్న దృష్ట్యా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మైక్ పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు, ర్యాలీలు చేసే నాయకులు, అధికారులు కళ్లెదుట ఉన్న వ్యర్థాలు పూర్తిగా తొలగించి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిన ప్రాథమిక బాధ్యతను ఇప్పటికైనా నెరవేర్చాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *