శంఖవరం, జూలై 16, (జనాసవార్త) :
————————————————-
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లోని జగ్గంపేట మండలం రాజపూడి, తొండంగి మండలంలోని ఏ కొత్తపల్లి, మండల కేంద్రం శంఖవరంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పాజిటివ్ కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా 17వ తేదీ శనివారం నుండి పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉంటుందని పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 -12 గంటల మద్య మాత్రమే దుకాణాలను తెరవాలని, మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ దుకాణాలను మూసివేయాలని, ఈ సమయంలో 144 సెక్షన్, కర్ఫ్యూ అమల్లో ఉంటాయని పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *