శంఖవరం, జూలై 16, (జనాసవార్త) :
—————————————————–
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతన్నల అభివృద్ధకి పెద్ద పీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మశాఆదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ తో కలిసి శంఖవరం మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామ స్థాయిలో రైతుల సమస్యలు తీర్చడంతోపాటు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, విత్తన, పంటలను ఆశించు క్రిమి సంహారక మందులను అందించాలనే లక్ష్యంతో ఈ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించింది అన్నారు. ఒకేసారి రెండు కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడే రైతులకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసింది అన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్సీపి ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతులు అభివృద్ధి చెందడానికి ఆర్బీకేలు ఎంతగానో ఉపయోగ పడతాయి అన్నారు. అనంతరం ఆర్బీకేలో ల్యాబ్, మందులు, అగ్రి కియోస్క్ లను పరిశీలించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రుల బృందం తిలకించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉప సర్పంచి చింతంనీడి కుమార్,
వ్యవసాయశాఖ ఏడి సుంకర బుల్లిబాబు, ఏఓ కెజె.చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారిణి శ్రీవల్లి, పశు సంవర్ధశాఖ ఏడి డా. వీర్రాజు, వైద్యులు కె.ప్రసాద్, లావణ్య, ప్రియాంక, తాహశీల్దార్ కర్నాసుల సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, మూడు సచివాలయాల కార్యదర్శిలు సీహెచ్. శ్రీరామచంద్ర మూర్తి, శంకరాచార్యులు, సరమర్ల సత్యవెంకటేష్, మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష, సచివాలయం 1 జూనియర్ సహాయకులు రమణమూర్తి, పర్వత స్వామి, బుర్రా లచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, భవనాల కాంట్రాక్టర్ పడాల గంగాధర రామారావు, మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *