శంఖవరం, జూలై 17, (మనం న్యూస్) :
——————————————————–
ఆంధ్ర్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొటదించిన దిశ అనువర్తనం మహిళల పాలిట ఆపద్భాంధవిలా ఉపయోగ పడుతుందని అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పంచాయితీ కార్యాలయ ఆవరణలో మహిళలకు దిశ అనువర్తనంపై అవగాహన సమావేశాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. సభాధ్యక్షునిగా సర్పంచ్ మాట్లాడుతూ దిశ అనువర్తనం మహిళలకు అన్ని రకాలుగా రక్షణగా ఉపయోగ పడుతుందని అన్నారు. తెలంగా రాష్ట్రంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందు చూపుతో ఈ దిశ విధానాన్ని రూపొందించారు అన్నారు. ఇప్పుడు నేరాలు – ఘోరాలు, సీఐడి వంటి మకుటాలతో నేరాలను ప్రచార మాధ్యమాలే చూపిస్తూ అమాయక యువత పెడదారి పట్టడానికి కారణం కావడం దురదృష్టకరం అన్నారు. అందువల్ల ఇండ్లలోనే యువతకు నైతిక సత్ప్రవర్తన, మహిళల గౌరవ భావాన్ని పెంచాలి అన్నారు. అన్నవరం ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ దిన అనువర్తనంలోని అన్ని విషయాలనూ సమగ్రంగా మహిళలకు వివరించారు. దిశ బిల్లు ఇంకా పార్లమెంటులో చట్టరూపం ధరినచాల్సి ఉందన్నారు. ఐనప్పటికీ దిశ అనువర్తనం మహిళలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అన్నారు. పిల్లల పెంపకం సరిగా లేకపోతే దుండగులు తయారౌతారు అన్నారు. కుటుంబ పెంపకం బావుంటే మంచి యువత, మంచి సమాజం ఏర్పడుతుందనీ, అప్పుడు మహిళలకు ఈ చట్టాల అవసరం, యువకుల నునచి వేధింపులు అంతగా ఉండవని ఆయన పేర్కొన్నారు. మహిళా పోలీసు ఉమా అంజనీదేవి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. సచివాలయం 1 కార్యదర్శి సిహెచ్. శ్రీరామచంద్రమూర్తి, సచివాలయం 2 కార్యదర్శి సత్యనారాయణ, వీఆర్వో. తాటిపాక అచ్యుతం, అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎమ్, వలంటీర్లు, వైఎస్సార్ క్రాంతి పధం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *