యస్.రాయవరం, 18 జులై 2021.
————————————————
అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఐటిడిపి అధ్యక్షుడుగా భీమరశెట్టి శ్రీనివాసరావు నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఈ నియామకాన్ని ఆదివారం ప్రకటించింది. ఈ సందర్భంగా భీమరశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సోషల్ మీడియా ఐటిడిపి అధ్యక్షులుగా నియమించి నందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడుకి ధన్యవాదములు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని కట్టబెట్టడానికి సహకరించిన అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జీ బుద్ధ నాగ జగదీష్, తెదేపా జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, పాయకరావుపేట మాజీ శాసన సభ్యురాలు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఐటీడీపీ రాష్ట్ర ఇంచార్జ్ చింతకాయల విజయ్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కర్రి సాయికృష్ణ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలనూ ప్రచారం చేస్తూ, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ నేను చేసిన సేవలను గుర్తించిన అధినాయకత్వానికి సదా రుణపడి ఉంటాను అన్నారు. తెలుగు దేశం పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ కార్యక్రమాలకు ప్రచారం కల్పిస్తూ, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *