గుమ్మరేగుల, జూలై 20, (జనాసవార్త) :
——————————————————
మహిళలను రక్షణను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ అనువర్తనాన్ని రూపొందింప చేసారని గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ అన్నారు. దిశా అనువర్తనం వినియోగంపై తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని గుమ్మరేగుల గ్రామంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల ప్రాంగణంలో సర్పంచ్ రామకృష్ణ అధ్యక్షతన అవగాహనా సదస్సును మంగవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్ రామకృష్ణ సభికులను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రతి మహిళ దిన అనువర్తనా(యాప్)న్ని తమ ఆండ్రాయిడ్/ ఐఓఎస్ సౌకర్యం ఉన్న మోబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని ఆయన అన్నారు. అందువల్ల బాలికలు గాని మహిళలు గాని అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదంలో ఉంటే యాప్ ని ఓపెన్ చేసి ఐదు సార్లు షేక్ చేస్తే ప్రమాద సమాచారం దిశా పోలీస్ స్టేషన్ వెళుతుందని, దానిలో ఉన్న ట్రాకర్ ఆధారంగా మీ యొక్క లొకేషన్ షేర్ చేసి, మీరు ఉన్న ప్రదేశానికి స్థానిక పోలీసుల సహాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల / మహిళను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ ని ప్రవేశపెట్టారని, వారి భద్రతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు. అందువల్ల భయాన్ని వీడి బాలికలు, మహిళలూ అందరూ ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపును ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎప్పడూ మీ పక్కనే తోడుగా ఉండలేరని, అందువల్ల దిశ అనువర్తనం మీకు తోడుగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ దిశ అవగాహనా సదస్సులను తమ పంచాయితీ పరిధిలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సులోని మంచి విషయాలను, దిశ అనువర్తనాన్ని బాలికలు, మహిళలు అందరూ సద్వినియోగం చేసుకో వాలని గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ వివరించారు. అనంతరం గుమ్మరేగుల ఉప్పంపాలెం గ్రామాల విమెన్ కానిస్టేబుల్ బి.మాధవి మాట్లాడుతూ ఈ యాప్ ఫై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్వి. నాయుడు, కోటనందూరు పోలీస్ ఎస్సై. ఎం.అశోక్, ఉప్పంపాలెం సర్పంచ్ ఎనుముల కోటుబాబు, ఈవోపిఆర్డి. విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆర్. నాగు, వీఆర్వో విఎల్. ప్రశాంతి, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు, అంగన్వాడీ, ఆస్పత్రి సిబ్బంది గ్రామ మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *