శంఖవరం, జూలై 20, (జనాసవార్త) :
—————————————————
మహిళల రక్షణకు ఉద్దేశించి నిర్వహించే దిశ అవగాహనా సదస్సు కార్యక్రమాలను విజయవంతం చేయాలని శంఖవరం పంచాయితీ ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ పిలుపును ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని పంచాయితీ పరిధిలోని మూడు సచివాలయాల సిబ్బందికి కలపి సచివాలయం 1 లో మంగళవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలోసిబబందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా మూడు సచివాలయాల సంయుక్త సారధ్యంలో స్థానిక శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ప్రజా కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహించే దిశ అవగాహనా కార్యక్రమాన్ని వాలంటీర్లు, మిగతా సిబ్బంది అంతా హాజరు కావడంతోపాటు సదస్సును విజయవంతం చేయాలి అని కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ ని సచివాలయాల్లోని అన్ని వర్గాల మహిళలు, బాలికలు, విద్యార్ధినులు అందరూ వారి మోబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేయించాలి అన్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. మూడు సచివాలయాల పరిధిలోని 80 మంది వలంటీర్లలో ఒక్కో వలంటీర్ ముగ్గురు మహిళలు చొప్పున మొత్తం 240 మందిని ఈ సభకు తీసుకు రావాలని ఈ సంధర్భంగా అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మూడు సచివాలయాల కార్యదర్శులు సిహెచ్. శ్రీరామచంద్ర మూర్తి, శంకరాచార్యులు, సరమర్ల సత్యవెంకటేష్, వీఆర్వో సీతారాం, మహిళా పోలీసు జిఎన్ఎస్ శిరీష, సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *