* 11 మంది యువతులు
* 16 మంది యువకుల అరెస్ట్‌

చెన్నై, జూలై 22, (జనాసవార్త) :
—————————————-
విందు, విలాసాల పార్టీలు నిర్వహిస్తున్న సహాయ నటి కవితశ్రీ, అందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తూర్పు సముద్రతీర ప్రాంతం, నీలాంగరై సమీపంలోని కానత్తూర్‌ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్‌లో పార్టీ పేరుతో విందులు, విలాసాలతో యువతుల శృంగార డాన్సులు, రసజ్ఞులైన యువకులతో వ్యాపారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో కానత్తూరు పోలీసులు మంగళవారం వేకువ జామున ఫాం హౌస్‌కు వెళ్లారు. అక్కడ యువతీ యువకులు అరకొర దుస్తుల్లో మద్యం మత్తులో డాన్స్‌ చేస్తున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. రామాపురానికి చెందిన శ్రీజిత్‌కుమార్, సినీ సహాయ నటి కవితశ్రీ కలిసి ఈ పార్టీలను నిర్వహిస్తు ఉన్నట్లు విచారణలో తేలింది. వీరు సినిమా షూటింగ్‌ పేరుతో ఆ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకుని విలాసాలతో కూడిన విందు పార్టీలను నిర్వహిస్తు ఉన్నారు.. ఈ పార్టీలకు యువతులను డబ్బులు ఇచ్చి తీసుకు వస్తున్నట్లు విందులో పాల్గొని యువకుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విధంగా కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీలను నిర్వహిస్తున్న కవితశ్రీ సహా 11 మంది యువతులను, 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *