reddit secret santa gifts valentine's day gifts for her macy's daysee birth control coupons couponcabin app review

* గోదావ‌రి బోటు మున‌క బాధిత కుటుంబంలో మ‌ళ్లీ శిశువుల కేరింత‌లు

(రాజ‌హంస, 9490263115)

విశాఖ‌ప‌ట్నం, 18 సెస్టెంబ‌రు 2021.
_____________________________

ఆ విధి వంచితుల త‌ర‌రాత మారింది. అనుకోని ఘ‌ట‌న‌తో పుట్టెడు దుఃఖంలో మునిగిన కుటుంబంలో మ‌ళ్లీ కేరింత‌లు వెల్లివిరిశాయి. స‌రిగ్గా రెండేళ్ల క్రితం, 2019 సెప్టెంబ‌రు 15న 73 మంది ప్ర‌యాణీకుల‌తో రాజ‌మండ్రి నుంచి భద్రాచ‌లం బ‌య‌ల్దేరిన రాయ‌ల్ వ‌శిష్ట ప‌డ‌వ గోద‌వ‌రి న‌దిలో మునిగిన ఘ‌ట‌న ఎంద‌రినో దుఃఖంలో ముంచెత్తింది. అప్ప‌టికే ఇద్ద‌రు పిల్లల్ని క‌ని ట్యూబెక్ట‌మీ ఆప‌రేష‌న్ చేయించుకున్న ఓ మ‌హిళ సెప్టెంబ‌రు 15 బుధ‌వారం నాడు (ఐవీఎఫ్ గ‌ర్భ‌ధార‌ణ‌తో) ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం వారి దుఃఖ దినాలు ఆనంద‌మ‌యంగా మారియి. గ‌ర్భ‌శోకంనాడే మ‌ళ్లీ గ‌ర్భం పండ‌టం, పండంటి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో వారి ఆనందానికి అవ‌ధుల్లేవు.

వివ‌రాల్లోకి వెళితే… ఆ ప్ర‌మాదంలో త‌న త‌ల్లి దండ్రులు ఇద్ద‌రు, క‌న్న‌ బిడ్డ‌ల‌తోపాటు, ర‌క్త‌ సంబంధీకుల్ని కోల్పోయిన‌ వారికి క‌నీస ఓదార్పుగా ప్ర‌మాదంలో గ‌ల్లంతైన వారి భౌతిక‌ దేహాల గాలింపు కోసం స‌హాయ‌క బృందాలు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ద‌క్క‌ని ప‌రిస్థితిలో…. విశాఖ‌ప‌ట్నం ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబీకులు 11 మంది గోదావ‌రిలో ప్ర‌యాణిస్తుండ‌గా వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే బ‌తికి బ‌ట్ట‌క‌ట్టారు. న‌గ‌రంలో గ్లాస్ డిజైన‌ర్ (అద్దం పెంకుల‌పై క‌ళాకృతులు తీర్చిదిద్దే నిపుణుడు) త‌లారి అప్ప‌ల రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తుల ఇద్ద‌రు కుమార్తెలు గీతా వైష్ణ‌వి (3), ధాత్రి అన‌న్య (ఏడాదిన్న‌ర‌) ల‌ను త‌మ తాత‌య్య‌, నాయ‌న‌మ్మ‌ల‌తో భ‌ద్రాచ‌లం శ్రీ‌రాముడి ద‌ర్శ‌నానికి పంపారు. ఆ విషాద ఘ‌ట్టంలో త‌మ వారిని కోల్పోయి, పుట్టెడు దఃఖంలో ఉన్న అప్ప‌ల‌రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తులు జీవితాన్ని పున‌ర్న‌ర్మించుకునే వెతుకులాట‌లో ప‌ద్మ‌శ్రీ ఆస్ప‌త్రి ప్ర‌ధాన వైద్యురాలు డాక్ట‌ర్ సుధాప‌ద్మ‌శ్రీ ని సంప్ర‌దించారు.

వైద్య చ‌రిత్ర‌లో ఒక అపురూప ఘ‌ట్టం – డా. సుధా ప‌ద్మ‌శ్రీ‌

గ‌త ఏడాది త‌లారి అప్ప‌లారాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తులు ఔట్ పేషెంట్ క్లినిక్‌లో సంప్ర‌దించారు. జ‌రిగ‌న పంగ‌తుల‌న్నీ విన్న త‌ర్వాత నాకు దుఃఖం ఆగ‌లేదు. ముందు ఆ దంప‌తుల ధైర్య వ‌చ‌నాలు చెప్పి ఆత్మ‌స్థియ‌ర్యం నింపి కొన్ని రోజుల త‌ర్వాత వైద్యం ప్రారంభించాను. అప్ప‌టికే ట్యూబెక్ట‌మీ విధానంలో కుటుంబ నియ‌త్రంణ శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న‌ భాగ్య‌ల‌క్ష్మి దంప‌తుల‌కు ఐవీఎఫ్ గురించి వివ‌రించాను. కొంత‌కాలం త‌ర్వాత లాక్‌డౌన్‌, కోవిడ్ ప్రొటోకాల్ ఐనా దంప‌తులు చాలా ఓపిగ్గా అన్నింటినీ స‌హించారు. గ‌ర్భ‌ఫ‌లంకోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఒక సంతాన సాఫ‌ల్య నిపుణురాలిగా నేను కూడా ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా స్వీక‌రించి వైద్య చ‌రిత్ర‌లో ఒక అపురూప ఘ‌ట్టానికి మార్గం సుగ‌మం చేశాన‌న్న సంతృప్తి క‌లిగింది. చివ‌రి రుతు చ‌క్రం (ఎల్‌.ఎం.పి.-లాస్ట్ మెన్‌స్ట‌ర‌ల్ పీరియ‌డ్‌) ప్ర‌కారం అక్టోబ‌ర్ 20వ తేదీన ప్ర‌స‌వం వ‌స్తుంద‌ని అంచ‌నా వేశాం. సెప్టెంబ‌ర్ 15న భాగ్య‌ల‌క్ష్మికి పురిటి నొప్పులు రావ‌డంతో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా శ‌స్త్ర‌చికిత్స చేశాం. 1.9 కిలోలు, 1.65 కిల‌ల‌తో పిల్లిద్ద‌రూ ఆరోగ్యంగా జ‌న్మించారు. ప‌ద‌ర్మ‌శ్రీ ఆస్ప‌త్రి న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ విభాగం (ఎన్‌.ఐ.సి.యు)లో డాక్ట‌ర్ శ్రీ‌దేవి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో త‌ల్లి బిడ్డ‌లిద్ద‌రూ సుర‌క్షితంగా ఉన్నారు. ఇప్పుడు భాగ్య‌ల‌క్ష్మి కుటుంబీకుల ఆనందానికి ప‌ట్ట‌గ్గాల్లేవు. వైద్య నిపుణులుగా మాకు ఇతంకు మించిన జాబ్ శాటిస్‌ఫేక్ష‌న్ (వృత్తిలో సంతృప్తి) ఇంకేముంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *