great gift for grandpa twister movie gifts tesco gift sets for her carefree coupon june 2014 viva /1 coupon

* పోటీలోని 8 ఎంపీటీసీ స్ధానాలూ వైకాపావే
* లోగడ 8 మంది వైకాపాఎంపీటీసీలు ఏకగ్రీవం
* శంఖవరం మండలం వైకాపా క్లీన్ స్వీప్
* ఇక రాజబాబు మండలాధీశుడు

శంఖవరం / సామర్లకోట, సెప్టెంబర్ 19 :
___________________________________

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు పాలనాపీఠాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ మండల పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు పర్వత గుర్రాజు (రాజబాబు) అధిష్ఠించ నున్నారు. ఈయనే కాబోయే మండలాధీశుడు. దానికి సమాంతరంగా మండలం యావత్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా అవతరించ నున్నది. ఈ మహత్తర ఆవిష్కరణలకు ప్రధాన విశేష కారణాలు మూడంటే ముచ్చటగా మూడు. మండల పరిషత్తుకు జరిగిన ప్రజా ప్రాతినిధ్య పాలక వర్గ సభ్యుల ఎన్నికల్లో మొత్తం 16 ప్రాదేశికవర్గ నియోజకవర్గ స్థానాల నుంచి మొత్తం 16 మంది విజేత అభ్యర్థులూ వైఎస్సార్ పార్టీకి చెందిన వారు కావడం ఓ విశేషం ఐతే… మండలం నుంచి తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు పాలకవర్గ ప్రజాప్రాతినిధ్య పదవులకు జరిగిన ఎన్నికల్లో శంఖవరం మండలం నుంచి జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఇదే వైకాపా పార్టీకి చెందిన, మండలంలోని
ఉప ప్రణాళికా ప్రాంత గిరిజన గ్రామం సిద్దివారిపాలెం నకు చెందిన తరుం మల్లీశ్వరి తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్థి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బచ్చల గంగపై 14,579 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయాన్ని కైవసం చేసుకోవడం మరో విశేషం. వీరందర్నీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ బలపర్చి, వీరిని పోటీలో నిలిపి, తన ధనాన్ని, విజ్ఞతను, సమయాన్ని, రాజనీతి చతురతును వినియోగించి, తన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమించి అభ్యర్థుల దోసిలికి విజయాన్ని ఓ వరంగా బహూకరించడం మూడో విశేషం.

 “పర్వత” వంశ పారంపర్యమూ విజయాల పరంపరే…
__________________________________

విజయాల పరంపర “పర్వత” వంశ పారంపర్యంగా అందివస్తున్నవే. వాటిలో తాజా విజయాలే మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు విజయాలు. విజయాలకు మకుటం… పర్వత కుటుంబం… అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ఇక తాజా ఎన్నికల విజయ పరంపరలోనికి తొంగి పరికించి చూస్తే….
శంఖవరం మండలంలోని 16 ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల ష్రజాప్రాతినిధ్య అభ్యర్ధిత్వాలకు 51 మంది నామినేషన్లను మార్చిలో దాఖలు చేయగా వారిలో ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 31 మంది వారి నామ పత్రాలను ఉపసంహరించు కున్నారు. ఫలితంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులు అన్నవరం నుంచి దడాల సతీష్ , శంఖవరం నుంచి నలుగురు పర్వత గుర్రాజు (రాజబాబు), అడపా వీరబాబు, పులి సత్యవతి, గెడ్డం రాణి, నెల్లిపూడి నుంచి పిర్ల నాగేశ్వరరావు, గౌరంపేట నుంచి ఒకరు, జి.కొత్తపల్లి నుంచి ఒకరు ఎంపీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఫలితంగా మండలంలో ఇక మిగిలిన ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకూ వై.కా.పా. నుంచి తొమ్మిది మంది, తె.దే.పా. నుంచి మరో తొమ్మిది మంది, భా.జ.పా. నుంచి ఇద్దరు మొత్తం 20 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. ఇక జడ్పీటీసీ అభ్యర్ధుల విషయానికి వస్తే వైకాపా నుంచి సిద్దివారిపాలెంనకు చెందిన తరుం మల్లీశ్వరి, తెదేపా నుంచి పెదమల్లాపురం గ్రామానికి చెందిన బచ్చల గంగ పోటీలో ఉన్నారు. ఈ స్థానాలకు (వీరికి) లోగడ ఎన్నికలు జరిగాయి. కాగా సామర్లకోటలోని వైటీసీ కేంద్రంలో ఆదివారం ఓట్ల లెక్కింపులో మొత్తం పోటీలో ఉన్న 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులే విజయాన్ని కైవసం చేసుకున్నారు. వీరిలో కొంతంగి ఎంపీటీసిగా వైకాపా అభ్యర్థి నడిగట్ల వీర్రాజు (నానాజీ) తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఆకేటి శ్రీనుపై 695 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అలాగే కతిపూడి 1వ ఎంపీటీసిగా చప్పా మంగాదేవి 1,028 ఓట్ల ఆధిక్యతతోను, 2 వ ఎంపీటీసీగా జీలకర్ర విష్ణు 1,306 ఓట్ల ఆధిక్యతతోనూ, 3 వ ఎంపీటీసీ స్థానం నుంచి చల్లా సత్యగంగాప్రసాద్ 1,137 ఓట్ల ఆధిక్యతతోనూ, మండపం ఎంపీటీసీగా కూనిశెట్టి సత్యవతి 1,352 ఓట్ల ఆధిక్యతతోను, అన్నవరం 1వ ఎంపీటీసీ స్థానం నుంచి కొండి లక్ష్మి 853 ఓట్ల ఆధిక్యతతోను, అన్నవరం 3 వ ఎంపీటీసీ స్థానం నుంచి దరా వెంకటరమణ 728 ఓట్ల ఆధిక్యతతోనూ, పెదమల్లాపురం ఎంపీటీసీ స్ధానం నుంచి దుగారాజు నారయ్య 1,219 ఓట్ల ఆధిక్యతతోనూ తమ సమీప తెలుగు దేశం పార్టీ ప్రత్యర్థులపై విజయం సాధించారు. అంటే మండలం మొత్తం మీద 16 ఎంపీటీసీ స్ధానాలు ఉండగా ఈ స్థానాలు అన్నిటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో శంఖవరం మండలం మొత్తం వైకాపాకు క్లీన్ స్వీప్ అయ్యింది. ఇక జడ్పీటీసీ ఎన్నికల విషయానికి వస్తే… శంఖవరం వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిగా ఉప ప్రణాళికా ప్రాంత గిరిజన గ్రామం సిద్దివారిపాలెంనకు చెందిన తరుం మల్లీశ్వరి తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్థి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బచ్చల గంగపై 14,579 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఈ రెండు ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ నామ రూపాలు లేకుండా ఏకగ్రీవంగా తుడుచు పెట్టుకు పోయింది. ఈ విజయ సంరంభంలో శంఖవరం మండల వైకాపా శ్రేణులు ఆనంద డోలికల్లో తేలియాడు తున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం మొత్తం ఇదే తరహా విజయానంద వాతావరణం నెలకొన్నది. పర్వత ప్రసాదా … మజాకా …. అని సరదాగా అనుకోవచ్చా…..?

రాజబాబు … ఇక మండలాధీశుడు…
________________________________

నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉండగానే రాజబాబు తన నామినేషన్ వేసిన మరుక్షణం నుంచే పర్వత రాజబాబును ఎంపిపి అభ్యర్థి / కాబోయే ఎంపిపిగా వైకాపా ప్రకటించింది. ఊరేగింపుగా ఊరంతా పరిచయం చేశారు. నాడే సంబరాలు జరుపుకున్నారు. నేడది నిజం చేసి చూపించారు. ఒకప్పటి శంఖవరం సర్పంచ్, అన్నవరం రత్నగిరి శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు, ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ సమన్వయకర్త పర్వత రాజబాబు ఇకపై శంఖవరం మండలాధీశుడు. పర్వత వంశంలో తొలి తరం మండలాధీశురాలు ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు సతీమణి, మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కాగా రెండో తరంలో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, తూర్పు గోదావరి జిల్లా తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షుడు పర్వత శ్రీసత్యనారాయణమూర్తి కాగా ఆయన తమ్ముడే తాజా మండలాధీశుడు రాజబాబు. ఆదరిస్తున్న మండల ప్రజానీకం నిజంగా అభినందనీయులు. నేతలు కాదు… నిజ విజేతలు ప్రజలే. ప్రజా సేవకు ప్రజా ప్రభువులు మనస్సాక్షితో పునరంకితం కావడంతోనే ప్రజా రుణం పరిహారం కాగలదు. సత్యమేవ జయతే… !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *