fairchild tropical botanic garden gift shop genteal eye drops printable coupon pearson 2013 coupon code epping house of pizza coupons cute gift basket ideas for christmas lost freedom gift card

* తూర్పున మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ బిజీ
* నేతలు చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
* సామాజికవర్గాల సమతుల్యతే ప్రాతిపదిక

శంఖవరం – జనాసవార్త
_______________________

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజేతల హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో 24 న మండల పరిషత్తుల పాలక వర్గాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, పాలక వర్గాల ప్రమాణ స్వీకారం, 25 న జిల్లా పరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎన్నికల సందడికి సరికొత్తగా తెరలేపి నట్లైంది. ఓ పక్క ఈ విజేతల ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉండగా దానికి సమాంతరంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని జిల్లా పరిషత్తు అధ్యక్షుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షులు 19 మంది పేర్లనూ ఖరారు చేసింది. ఇక మండల పరిషత్తుల అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక బాధ్యతను మాత్రం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు విడిచి పెట్టింది. మండల పరిషత్తుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికలో సామాజిక వర్గాల సమతుల్యతను విధిగా పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారు. ఈ విధాన ప్రకటనే శిరోధార్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కధనం రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరు ఓ స్పష్టమైన అవగాహనతో సిద్ధంగా ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరు క్షణం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎంపికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తలమునకలై పోయారు. జిల్లాలోని 7 రెవెన్యూ డివిజన్లలో 19 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 64 మండలాలు ఉండగా వీటిలో మూడింటిని కోర్టు, ఇతరత్రా కారణాలవల్ల మినహాయించి మిగిలిన 61 మండలాల్లో 61 జెడ్పీటీసీ స్థానాలు, అలాగే 999 ఎంపీటీసీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. 61 జడ్పీటీసీ స్థానాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 58 మంది, తెలుగు దేశం పార్టీ (వి.ఆర్.పురం) నుంచి 1, జ‌న‌సేన‌ పార్టీ (కడియం) నుంచి 1 చొప్పున విజేతలుగా నిలిచారు. మరో స్థానం మారేడుమిల్లికి సంబంధించి దొరచింతలపాలెం జడ్పీటీసీ స్థానంలో ఓట్లు తడిసిన కారణంగా లెక్కించలేదు. అలాగే జిల్లా మొత్తం మీద 999 ఎంపీటీసీ స్థానాల్లో అధికార వైఎస్సార్ సీపీ నుంచి అత్యధికంగా 764, టీడీపీ 110, జ‌న‌సేన‌ 93, స్వ‌తంత్రులు 19, సీపీఎం 7, బిజెపి 2, బిఎస్పి 1, ఇందిరా కాంగ్రెస్ 1 చొప్పున విజేతలు అయ్యారు. ఓట్ల పత్రాలు చెదల వల్ల పాడైన కారణంగా పెద్దాపురం మండలం పులిమేరు, తడిసిన కారణంగా మారేడుమిల్లి మండలం దొరచింతలపాలెం ఎంపీటీసీ స్థానాల్లోని ఓట్లను లెక్కించలేదు. దరిమిలా జిల్లాలోని ఆయా విజేతల పార్టీల నేతలు మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ల సభ్యుల ఎంపిక కసరత్తులో బిజీ బిజీగా ఉన్నారు. జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవులకు అభ్యర్థులను పార్టీయే ఎంపిక చేసింది. ఇక మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ల సభ్యుల ఎంపిక నిర్ణయాధికారం మాత్రం జిల్లా మంత్రులు, ఎంపీలు, 19 మంది ఎమ్మెల్యేలపైనే ఉంచింది. దీంతో ఆయా నేతల ఇళ్ళ చుట్టూ తమకు అధ్యక్ష్య, ఉపాధ్యక్ష్య పదవులు కావాలని కోరుతూ ఎంపీటీసీ విజేతలు, అలాగే కో ఆప్షన్ సభ్యుల పదవులు కావాలని ఆశావహులు ప్రదక్షిణలు చేస్తూన్నారు. వారు నేరుగా ప్రయత్నాలను చేస్తూనే మరోవైపు వారి కోటరీలతో పరోక్ష ప్రయత్నాలూ ముమ్మరం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు కొంత కార్యాచరణతో, శ్రమాధిక్యతతో విజేతలు కాగా కో ఆప్షన్ సభ్యుల పదవుల నియామకం రీతిలో వరించేవి కావడంతో క్రిష్టియన్, ముస్లిం మైనారిటీ మతాల నుంచి జిల్లా మొత్తం మీద 61 మంది కో ఆప్షన్ సభ్యులు ఆయాచితంగా పదవులను పొందుతారు. 2019 శాసనసభా ఎన్నికల్లో క్రైస్తవులు అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపినప్పటికీ ఎక్కువ మంది పాస్టర్లు మాత్రం ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అటు తెలుగు దేశం పార్టీకీ కప్పదాట్లు వేసారు. ఈ నేపధ్యంలో కో ఆప్షన్ సభ్యుల నామినేటెడ్ పదవులు మాత్రం ఈ సారికి ముస్లింలకే ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. ఏతావాతా మొత్తం పదవులకు అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రం బిజీజిజీగా ఉన్నారు. ఈ పదవుల పందారంలో విజేతలెవరో… పరాజితులు ఎవరో… 25 తేదీ వరకూ
వేచి చూడాల్సిందే….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *