giftmord china go green recycling coupon lodi israel gift store gift joy registry finanslov 2016 bilafgifter

* నెల రోజుల్లో హద్దుల్ని స్థిరీకరించాలి
* పెదగుమ్ములూరు కేసులో హైకోర్టు హుకుం

పెదగుమ్ములూరు – జనాసవార్త
______________________________

విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులోని ఎర్ర చెరువు, గెడ్డవాగు ఆక్రమణలను నెలకొన్న రోజుల్లో తొలగించి, సరిహద్దులు స్థిరీకరించాలని హైకోర్టు హుకుం జారీ చేసింది. గ్రామంలోని సర్వే నెంబర్ 216-3 లోని
ఎర్ర చెరువు గర్భం 1.50 ఎకరాల్లోని కొద్ది భాగాన్ని ఆక్రమించి ప్లాట్లుగా చేస్తున్న విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. స్థానిక సర్వే నెంబర్ 216 లో 21.68 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్ర చెరువు, తిమ్మాపురం గెడ్డ వాగులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నoదున ఆక్రమణలు తొలగించాలన్న ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోనందున ఎస్.రాయవరం మండల యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు
14981/2021 నంబరుతో 24 .05.2021న, 11.06.2021 న దాఖలు చేసిన నేపధ్యంలో 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సర్వే నెంబర్ 216 లో పూరాకేతు ఎకరాలు 21.68 సెంట్లు విస్తీర్ణం లో ఎర్ర చెరువు సర్వే నెంబర్ 216-2 లో ఎకరాలు 3.34 సెంట్లు నేషనల్ హైవే రోడ్డుకు కేటాయించగా ఎర్ర చెరువు మధ్య భాగంలో నేషనల్ హైవే వేయడం జరిగినది. దీనితో ఎర్ర చెరువు మధ్యలో నేషనల్ హైవే ఎన్.హెచ్-5 రోడ్డు వేయడంతో రోడ్డు కు కుడి, ఎడమ వైపున రెండు భాగాలుగా విడిపోయినది. రోడ్డుకు పోను మిగిలిన ఎకరాలు 18.34 సెంట్లు భూమిలో సర్వే నెంబర్ 216-1లో ఎకరాలు 16.61 సెంట్లు యలమంచిలి నుండి నక్కపల్లి పోవు హైవే రోడ్డు కు కుడి వైపున పెదగుమ్ములూరు గ్రామంను ఆనుకొని ఉన్నది. ఇందులో సర్వే  నెంబర్ 216-1/1లో వాటర్ ప్లాంట్ కు 0.03 సెంట్లు, 216-1/2 లో శివాలయం కు 0.10 సెంట్లు, మొత్తం 0.13 సెంట్లు భూమి రెవెన్యూ ఫైనల్ గజిట్ 22ఏ ప్రకారం కేటాయిoచినది పోను ఎకరాలు 16.48 సెంట్లు భూమి రెవిన్యూ రికార్డుల ప్రకారం ఉండవలసి ఉండగా చాలా భాగం అక్రమార్కులు అక్రమించుకున్నారు.

ఇక మిగిలిన చెరువు భాగం సర్వే నెంబర్ 216-3 లో ఎకరా 1.73 సెంట్లు భూమి నేషనల్ హైవేకు తిమ్మాపురం లోని గెడ్డ వాగుల ఎడమ వైపు తిమ్మాపురం గ్రామంను ఆనుకొని ఉన్నది. ఇందులో సర్వే నెంబర్ 216-3/1 లో సర్కిల్ పోలీస్ కార్యాలయంకు 20 సెంట్లు, 216-3/2 లో 0.03 సెంట్లు వాటర్ ట్యాంక్ కు మొత్తం 0.23 సెంట్లు భూమి కేటాయించినట్లు రెవిన్యూ ఫైనల్ గజిట్ 22ఏ ద్వారా తెలుస్తున్నది. దీనితో 0.23 సెంట్లు పోగా ఎకరాలు1.50 సెంట్లు భూమి నేషనల్ హైవేను ఆనుకొని తూర్పు వైపున, సర్కిల్ పోలీస్ కార్యాలయం కు ఉత్తరం వైపున ప్రభుత్వ ఎర్ర చెరువు ఉండవలసిన ఉన్నది. అయితే సర్వే నెంబర్ 218-2 లో ఉన్న ఎకరా 1.76 సెంట్లు జిరాయతి భూమిని ఇటీవల యస్.రాయవరం కు చెందిన వైస్సార్ పార్టీ నాయకుడు కొనుగోలు చేసి 14 ఫ్లాట్ లు గా చేసి పనులు ప్రారంభించారు. ఈ ప్లాట్లు వేసిన నాయకుడు ఎర్ర చెరువు సర్వే నెంబర్ 216-3 లో ఉన్న ఎకరా 1.50 సెంట్లలో కొద్ది భాగం ఆక్రమించి ప్లాట్లుగా వేసినట్లు ఆరోపణలున్నాయి.

ఈ ఆక్రమణదారుడు హైవే రోడ్డును ఆనుకొని సిమెంట్ తూరలు వేసి వెనుక ఉన్న ప్లాటుల భూమికి నూతనంగా అక్రమంగా దారి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేషనల్ హైవే ఆనుకొని కోట్ల విలువైన భూమి కావడంతో అక్రమార్కులతో కుమ్మక్కు అయి భారీగా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి సంబంధిత అధికారులు తమకు సంబంధం లేనట్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లు వెత్తు తున్నాయి. చెరువులు, వాగులను ఆక్రమించి ఎటువంటి నిర్మాణములు చేపట్టకూడదన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. తిమ్మాపురం రెవిన్యూలో గెడ్డ వాగు, పెదగుమ్ములూరు రెవిన్యూలో చెరువు కబ్జాకు గురైందని ఈ వాగు, సర్వే నెంబర్లు 229, 230, 232, 233, చెరువు సర్వే నెంబర్లు 216-1, 216-3 లలో సర్వే చేసి, వాటి హద్దులను స్థిరీకరించాలని డిఇఇ. నిర్ణయించారు. అలాగే ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లను వేసి తమకు అప్పగిస్తే, తాము రాబోవు కాలంలో ఎవరూ అక్రమించకుండా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఆమె దగ్గరుండి జాయింట్ ఫీల్డ్ తనిఖీ, సర్వే చేయించగా ఆదర్శ పాఠశాల పక్కన ఉన్న గెడ్డ వాగు 252 లింకులు అనగా సుమారు 34 అడుగుల కాలువను దాదాపు 25 అడుగులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గతంలో పంచాయతీ తీర్మానం చేసి 10 అడుగులు రోడ్డు వేయగా ఆ రోడ్డును ఆక్రమించి వెడల్పు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ పాఠశాల వెనుక లేఔట్ కి సంబంధించి గెడ్డ వాగుని ఆనుకొని ఉన్న 4 బిట్లు గెడ్డ వాగు ఆక్రమించి వచ్చేలా వేసినట్లు గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణలు తొలగించి హద్దులు నిర్ణయించి తమ జల వనరులశాఖకు గెడ్డ వాగును అప్పగించాలని  కాబట్టి సంబంధిత జలవనరుల శాఖ అధికారులు, పంచాయతీ అధికారుల సమక్షంలో, రెవిన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు తొలగించి విలువైన ప్రభుత్వ ఆస్తులు కాపాడి తద్వారా ఇరు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తారని, అలాగే గ్రామ సరిహద్దులో ఉన్నందున ఎర్ర చెరువును అభివృద్ధి చేయడం వలన నీటి నిల్వలు పెంచడం ద్వారా భూగర్భ జలాలు పెరగి, రాబోవు కాలంలో తాగునీటికి, సాగునీటికి ప్రజలకు ఎంతో సహాయo చేసిన వారు అవుతారని సోమిరెడ్డి రాజు, కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం సంబంధిత అధికారులను పిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదoటూ హైకోర్టు ను ఆశ్రయించగా తేదీ 24 .05.2021 మరియు 11.06.2021 న పిర్యాదుల ప్రకారం 4 వారాలలో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *