zara discount coupon 2013 sprint coupon codes november 2015 brambleton deli coupons us vitamin injections coupon code 2013 gifts 2 your door uk gift tax rules uk 2013

* రంగంలోకి దిగిన వైకాపా పరిశీలకులు
* సమావేశాల్లో అందరికీ అవగాన కల్పన
* సభ్యులు చేజారి పోకుండా అప్రమత్తం

శంఖవరం – జనాసవార్త
_____________________

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండల ప్రజా పరిషత్తుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఏకాభిప్రాయానికీ, ఏకగ్రీవానికీ కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లోకెల్లా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో వైకాపాకు క్లీన్ స్వీప్ అయ్యింది. ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లో మాత్రం అత్యధిక ఎంపీటీసీ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ రాజకీయ చతురతతో ఈ నాలుగు మండలాల పరిషత్తుల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన మేరకు సామాజిక సమతుల్యతను పాటిస్తూనే ఆయా పదవులను పెట్టబోయే సమర్ధుల ఎంపిక ప్రక్రియను ఆయన చేపడుతున్నారు.

ఏలేశ్వరం మండల పరిషత్తు అధ్యక్షుడిగా ఓసి కాపు సామాజికవర్గం నుంచి ఏలేశ్వరం గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల్లో ఆరితేరిన, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ఛార్జి వరుపుల రాజా అనుచరుడుగా గుర్తింపును పొంది, 2019 శాసనసభ ఎన్నికల అనంతరం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గొల్లపల్లి బుజ్జిని, ప్రత్తిపాడు మండల పరిషత్ అధ్యక్షునిగా ఎస్సీ సామాజిక వర్గానికి, ప్రత్తిపాడుకి చెందిన రాజకీయాలకు కొత్త అయిన గొల్ల కాంతి సుధాకర్ ను, శంఖవరం మండల పరిషత్తు అధ్యక్ష్య పదవికి ఓసీ కాపు సామాజిక వర్గం నుంచి శంఖవరంనకు చెందిన, తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పర్వత సుబ్బారావు, పర్వత బాపనమ్మ, పర్వత శ్రీసత్యనారాయణమూర్తి అనుచరుడై, 2019 శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యే సీటు లభించిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకొచ్చి, అప్పటికే శంఖవరం సర్పంచ్, అన్నవరం రత్నగిరి శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు, ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ సమన్వయకర్త పదవులను చేపట్టిన పర్వత గుర్రాజు (రాజబాబు) ని, అలాగే రౌతులపూడి మండలం పరిషత్ అధ్యక్షురాలుగా ఎస్టి సామాజిక వర్గం నుంచి రౌతులపూడికి చెందిన, రాజకీయాలకు కొత్త అయిన గంటిమళ్ళ రాజ్యలక్ష్మికి పదవులను కట్టబెట్టేందుకు నియోజకవర్గ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు ప్రాథమిక సమాచారం.

ఇందులో ప్రత్తిపాడు ఎంపిపి అభ్యర్థి గొల్ల కాంతిసుధాకర్ రాజకీయాలకు కొత్త కావడంతో ఆయన ఎంపీటీసీ పోటీ విజయంపై సందేహంతో ముందు చూపుతో ఆయన సతీమణి నాన్సికేథరిన్ ను వొమ్మంగి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీలోకి దింపి కాంతిసుధాకర్ తో పాటు ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది. ఇక రౌతులపూడి ఎంపీపీ అభ్యర్థి గంటిమళ్ళ రాజ్యలక్ష్మి గృహిణి. రాజకీయాలకు ఈమె కొత్త. ఐతే ఈమె భర్త
గంటిమళ్ళ అప్పారావు రౌతులపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వసతిగృహ సంక్షేమాధికారి, వీరు కోటీశ్వరుల కుటుంబ నేపధ్యం ఈమెకు కలిసొచ్చిన అంశం. ఒక నియోజకవర్గంలో నాలుగు మండల పరిషత్తులు ఉంటే అందులో రెండు మండల పరిషత్తులకు మాత్రమే ఓసీ సామాజిక వర్గం నుంచి మండల పరిషత్తు అధ్యక్షులను చేయొచ్చని చెబుతున్నారు. మిగతా రెండు మండలాల పరిషత్తు అధ్యక్ష పదవుల్లో ఒకటి ఎస్సీకి, మరొకటి ఎస్టీకి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్కడ ఇలాగే గనుక జరిగితే నియోజకవర్గంలో ఉన్న బీసీ సామాజిక వర్గంనకు మండల పరిషత్తు అధ్యక్ష్య పదవి దక్కనట్టే. ఇక మండల పరిషత్తుల ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల పదవులను అలంకరించబోయే నేతల పేర్లు బహిర్గతం కావడంలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు రంగంలోకి దిగారు. మండలాల వారీగా పర్యటించి ఏకగ్రీవ పదవులను చేపట్టేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. శంఖవరంలోని శ్రీవాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గురువారం ఉదయం నిర్వహించిన శంఖవరం మండలం ఎంపీసీల సమావేశంలో ఎంపిపి పర్వత రాజబాబు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికలను పూర్తి చేయాలని తన తోటి వారికి పిలుపును ఇచ్చారు. ఆ విధంగా చేసి పార్టీ ప్రతిష్టను పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల్లో ఎంపీటీసీలకు అవగాహన కల్పిస్తున్నారు. తమ సభ్యులు చేజారిపోకుండా చూసుకుంటూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *